విజయ్ గెలిచాడు... అసలైన కానుక కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఘనవిజయం
- జన నాయగన్ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూపులు
- పొంగల్ కు విడుదల కావాల్సిన సినిమా
- సెన్సార్ చిక్కులతో ఆలస్యం
"కొన్నిసార్లు రావడం లేటవ్వొచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా"... ఈ డైలాగ్ నటుడు, తమిళనాడు వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రాజకీయ నాయకుడిగా విజయ్ గెలిచారు. కానీ ఆయన అభిమానులు మాత్రం మరో విజయం, మరో కానుక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అదే, ఆయన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల. ఎన్నికలకు ముందు, ఈ సినిమాతో అభిమానులకు ఒక చిరస్మరణీయ బహుమతి ఇవ్వాలని విజయ్ భావించగా, వరుస అడ్డంకులు విడుదలను ఆలస్యం చేశాయి. ఇప్పుడాయనే సీఎం పీఠం ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో, జన నాయగన్ విడుదల లాంఛనమేనని తెలుస్తోంది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను నిజానికి ఈ ఏడాది పొంగల్ పండుగకు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన బాలకృష్ణ 'భగవంత్ కేసరి' కథ స్ఫూర్తితో తమిళ నేపథ్యానికి అనుగుణంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
అయితే, 2025 డిసెంబరులో సెన్సార్‌కు వెళ్లినప్పటి నుంచి 'జన నాయగన్'కు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని మార్పులతో సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పినా, ఆ తర్వాత ఫిర్యాదులు వచ్చాయంటూ రివైజింగ్ కమిటీకి పంపింది. దీంతో చిత్రబృందం హైకోర్టును ఆశ్రయించగా, సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పుడు విజయ్ రాజకీయ విజయం సాధించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆయన ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో నిమగ్నమైనప్పటికీ, 'జన నాయగన్' విడుదలను మాత్రం నిర్లక్ష్యం చేయరని తెలుస్తోంది. ముఖ్యమంత్రి అయ్యేలోపు లేదా ఆ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ సినిమాను అభిమానులకు కానుకగా ఇవ్వాలని విజయ్ యోచిస్తున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
అయితే, సెన్సార్ పూర్తయినా విడుదల అంత సులభం కాదు. మే 14న సూర్య 'కరుప్పు' (తెలుగులో వీరభద్రుడు), మే 21న మోహన్‌లాల్ 'దృశ్యం 3', జూన్ 4న రామ్ చరణ్ 'పెద్ది' వంటి పెద్ద చిత్రాలు బరిలో ఉన్నాయి. ఈ పోటీ నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే 'జన నాయగన్' వస్తే బాక్సాఫీస్ వసూళ్లు పంచుకోవాల్సి వస్తుంది. పొంగల్ విడుదల సంగతి వదిలేస్తే, ఇప్పుడు మాత్రం సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.